- Advertisement -
హైదరాబాద్: ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముందుకు వచ్చారు. అవయవదానం బిల్లుపై చర్చ సందర్భంగా తాను అవయవదానానికి సిద్దంగా ఉన్నట్ల కెటిఆర్ ప్రకటన చేశారు. మన ప్రజాప్రతినిధులమని, అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తీసుకరావాలని సూచించారు. సభ్యులు ముందుకు వస్తేనే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని, అవయవదానంపై తొలి సంతకం తానే చేస్తానని కెటిఆర్ స్పష్టం చేశారు. అవయవదానం అనేది గొప్ప మానవీయ చర్య అని, అవయవదానం మరింత మందికి జీవితాన్ని ఇస్తుందన్నారు.
- Advertisement -