హైదరాబాద్: డీలిమిటేషన్‌పై గందరగోళం నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్‌పై సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. అసెంబ్లీలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి వ్యతిరేకంగా సిఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసన సభలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేశామని, జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను దివంగత ప్రధాని వాజ్‌పేయీ కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు. డీలిమిటేషన్‌పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొందరు అంటున్నారని, జనాభా నియంత్రణపై కేంద్ర ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్‌సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, డీలిమిటేషన్ జరిగితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుందని, డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అందరూ ఒకే మాటపై ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతోందని, 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్‌ను 25 ఏళ్లు నిలిపివేశారని దుయ్యబట్టారు.
డీలిమిటేషన్… మన ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుంది: రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -