- Advertisement -
ముంబై: ఐపిఎల్ 18 ముగిసిన వెంటనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. సిరీస్‌లో భారత్ ఐదు టెస్టు మ్యాచుల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే భారత కోచింగ్ బృందం లో భారీ మార్పులు చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కోచింగ్ బృందం చాలా పెద్దగా ఉందని, అంత మందిని ఉంచి ఎలాంటి ప్రయోజనం లేదని బిసిసిఐ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ నెలాఖరులో గౌహతిలో జరిగే బిసిసిఐ సమావేశంలో సహాయక సిబ్బందిలో కోత విధించే విషయంలో చర్చిస్తారని తెలిసింది. ఈ భేటిలో బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గంభీర్ పాల్గొంటారని తెలిసింది.
- Advertisement -