Wednesday, April 2, 2025

14 రోజుల పసికందుని హత్య చేసిన తల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆలీ నగర్‌లో 14 రోజుల పసికందును కన్నతల్లే దారుణంగా హత్య చేసింది. తమిళనాడుకు చెందిన దంపతులు హైదరాబాధ్‌కి పని కోసం వచ్చారు. అయితే భర్తకు కొద్దిరోజుల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తల్లి పసికందును నీళ్ల బకెట్‌లో ముంచి చంపి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించింది. స్నానం చేసి వచ్చే సరికి పసికందు నీళ్ల బకెట్‌లో పని పోయినట్లు నాటకం ఆడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా.. తానే బిడ్డను చంపినట్లు తల్లి ఒప్పుకుంది. దీంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News