Wednesday, April 2, 2025

మయన్మార్‌లో భారీ భూకంపం.. బ్యాంకాక్‌పై ప్రభావం

- Advertisement -
- Advertisement -

బర్మా: మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. మయన్మార్‌లోని మండలే పట్టణంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 7.7 నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భారీ భూకంపం కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ భూకంపం ప్రభావం బ్యాంకాక్‌పై కూడా పడింది. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న 20 అంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ బిల్డింగ్ కింద ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News