Wednesday, April 2, 2025

నొప్పి కన్న పరీక్షే ముఖ్యం.. స్ట్రెచ్చర్‌పై ఎగ్జామ్ హాల్‌కు..

- Advertisement -
- Advertisement -

తనకు ఒంటిపై గాయాలున్నా.. ఆ విద్యార్థినికి పరీక్షలే ముఖ్యంగా కనిపించింది. నొప్పిని భరిస్తూ.. స్ట్రెచర్‌పైనే ఎగ్జామ్ హాల్ వచ్చి పరీక్షలు రాస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన తనూజ అనే విద్యార్థి లేపాక్షి కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. కొద్ది రోజుల క్రితం తనూజ మెట్లపై నుంచి పడిపోవడంతో ఎడమ చేతికి, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు కనీసం నెల రోజుల పాటైన విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ, తనూజా మాత్రం పరీక్షలు రాస్తానని పట్టుదలతో అంబులెన్స్‌లో పరీక్ష కేంద్రానికి వెళ్లి.. పరీక్షలు రాస్తోంది. ఇది చూసిన తోటి విద్యార్థులు, టీచర్లు, తనూజ పట్టుదలను చూసి శభాష్ అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News