Friday, April 4, 2025

శిథిలాల్లో శవాల వేట

- Advertisement -
- Advertisement -

మయన్మార్‌లో తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు మాండలే నగరంలో వెల్లువెత్తుతున్న దుర్గంధం
వీధుల్లోనే గడుపుతున్న లక్షలాది మంది, సహాయం కోసం ఎదురుచూపులు ఇప్పటికీ మారుమూల
ప్రాంతాల్లోకి చేరని బృందాలు సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన మయన్మార్ అంతర్యుద్ధం

మాండలే (మయన్మార్): లెక్కలేనన్ని మరణాలు, కూలిన భవనాలతో మయన్మార్ స్మశానాన్ని తలపిస్తోంది. తీవ్ర భూకంపంలో 1,600 మందికి పైగా చనిపోయారు. చాలామంది జీవసమాధి అయ్యారు. మయన్మార్ లోని అతి పెద్ద నగరం మండలేలో ప్రజలు భవనాల శిథిలాలను తొలగిస్తుంటే.. కుళ్లిన శవాలు బయటపడుతున్నాయి. శుక్రవారంనాడు మండలే సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపతీవ్రత 7.7గా నమోదయింది. దీని ప్రభావం తో నగరంలోని విమానాశ్రయం, అనేక భవనాలు, కీలక సంస్థలు ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న రోడ్లు, కూలిన వంతెనలు, మరో పక్క అంతర్యుద్ధం సహాయ చర్యలకు అడ్డంకిగా మారాయి. ఇళ్లు కూలి వందలాదిమం ది నిరాశ్రయులయ్యారు.

ఎండలు మండి పో తున్నాయి. 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో శిథిలాల కింద కింద ఎవరైనా బతికి ఉ న్నారన్న ఆశలతో శిథిలాలను తొలగిస్తున్నా రు. మాండలే నగరంలో ఇప్పటికీ వేలాదిమంది వీధుల్లోనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మళ్లీ మళ్లీ వస్తున్న భూ ప్రకంపనలతో అల్లాడు తున్నారు. ఇప్పటికీ వారికి సహాయ సామగ్రి అందలేదు. మయన్మార్‌లో ఇంతవరకూ 1644 మంది చనిపోయారని, 3,408మంది గాయపడ్డారని అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇంకా శిథిలాలను తొలగించే పనిలో వేలాదిమంది నిమగ్నమయ్యారు. ఇంకా మారు మూల ప్రాంతాలను సహాయక బందాలు చేరలేదు. చాలా ప్రదేశాల్లో ఆహారం కొరత, మంచి నీరు అందుబాటులో లేదు. చాలా అస్పత్రులలో మందులు అందుబాటులో లేవు. గాయపడి ఆస్పత్రికి పెద్దఎత్తున తరలి వస్తున్న రోగులకు చికిత్స అందించడంలో వైద్యులు కష్టపడుతున్నారు. ఇటు భారతదేశం, అటు చైనా సహాయక బృందాలను పంపాయి.

వీరు శిథిలాల తొలగింపునకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రెండు భారతీయ సి-17 సైనిక రవాణా విమానాలు సహాయ సామగ్రితో నెపిటావ్ నగరం చేరాయి. ఫీల్డ్ హాస్పిటల్ యునిట్, 120 మంది శిబ్బందితో మాండలేకు చేరిన అత్యవసర శిబిరం ఏర్పాటు చేసింది. చైనా, సింగపూర్, రష్యా, మలేషియా, మరో పక్క థాయిలాండ్ నుంచి సహాయ బృందాలు, సహాయ సామగ్రి మయన్మార్ కు చేరాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయకచర్యలు చేపడుతున్నారు. ధాయిలాండ్ లో భూకంపంలో 17 మంది మృతి చెందారు. చాలా భవనాలు కూలిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News