Tuesday, April 8, 2025

అఫ్‌షోర్ మైనింగ్ సరికాదు.. ప్రధానికి రాహుల్ లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. సముద్రం లోతుల్లో మైనింగ్‌కు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. కేరళ, గుజరాత్, అండమాన్ తీరాల్లో మైనింగ్ టెండర్‌లు రద్దు చేయాలని కోరారు. శాస్త్రీయ అధ్యయనాలు లేకుండా ఆఫ్‌షోర్ మైనింగ్ సరికాదని అన్నారు. మైనింగ్ వల్ల సముద్ర పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతింటుందని, కోట్లాది మంది మత్స్యకారుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేట్ నికోబార్ వద్ద టెండర్లు పిలవడంపై స్థానికులు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News