Wednesday, April 16, 2025

మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త

- Advertisement -
- Advertisement -

నల్లగొండ జిల్లా, గుర్రంపోడ్ మండలం, తెరాటి గూడెంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో తన భార్య గొంతు కోశాడు. ఈ సంఘటన సోమవారం తీవ్ర సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దుగ్గెల కిరణ్, ఇదే మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన మేకల అరుణను ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. బతుకుదెరువు కోసం తెరాటిగూడెం చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన భర్తను అరుణ మందలించడంతో వారిద్దరి మధ్య వాదన తీవ్ర రూపం దాల్చింది. దీంతో కోపోద్రిక్తుడై మద్యం మత్తులో భార్య గొంతుకోసి చంపేశాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News