Saturday, April 5, 2025

బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

సిఐడి డిజి ఎం.రమేశ్ సారథ్యంలో
ఐదుగురు సభ్యులతో దర్యాప్తు
బృందం 90 రోజుల్లో దర్యాప్తు
పూర్తి చేయాలని ఆదేశం ఆన్‌లైన్
బెట్టింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన
చర్యలను సూచించనున్న సిట్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. మొత్తం ఐదుగురు పోలీ స్ అధికారులతో స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా సిఐడి డిజి ఎం రమేష్‌ను నియమించారు. ఈ మేరకు డిజిపి డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ టీంలో సీనియర్ పోలీస్ అధికారి ఐజి రమేష్ రెడ్డి, ఎస్‌పిలు సిం ధు శర్మ, వెంకట లక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉంటారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించి కేసుల ను సిట్‌కు బదిలీ చేయను న్నారు. ఆన్‌లైన్ బెట్టింగును నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిట్ ప్రభుత్వానికి సూచించనుంది. పేమెంట్‌లకు సంబంధించిన వ్యవహారాలపై ఆర్‌బిఐకికి సిట్ సూచనలను చేయనుంది.

పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ పోలీసుస్టేషన్‌లలో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఇతర పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇదివరకే యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల సహా పలువురు విచారణకు హాజరై బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయించగా న్యాయ స్థానాలు ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నాయి. సినీ నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీతోపాటు 25మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులు నమోదయ్యాయి. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరిపై కేసులు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News