- Advertisement -
లక్నో: ఐపిఎల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ప్రభుసిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు నేహల్ వధేరా విలువైన పరుగులు చేయడంతో 16.2 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ మాత్రం హైలెట్‌గా నిలిచింది. ఎల్‌ఎస్‌జి ఆటగాళ్లు రవి బిష్ణోయ్, ఆయుష్ బదోనిలు ఓ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నారు. ద్విగ్వేశ్ వేసి 10.1 ఓవర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న బదోనీ క్యాచ్‌ని అందుకోబోయాడు. బౌండరీ లైన్ దాటే సమయంలో బంతిని గాల్లోకి విసిరాడు. అదే సమయంలో బిష్ణోయ్ పరుగెత్తూకుంటూ డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్నో ఓడిపోయినప్పటికి ఇది అద్భుతమైన క్యాచ్ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
- Advertisement -