Sunday, April 13, 2025

ప్రభుత్వ ఆస్తులను వైఎస్ఆర్ కాపాడారు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెచ్ సియు కు సంబంధించిన ఇంచు భూమిని కూడా తాము తీసుకోమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి ఇక్కట్లు కలగకుండానే అభివృద్ధి ఉంటుందని హామీ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం రగులుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వాన్ని కాపాడుతామని అన్నారు. చంద్రబాబు హయాంలో బిల్లీరావుకు కట్టబెట్టిన భూముల కేటాయింపులను రద్దు చేసి దానిపై న్యాయపోరాటం చేసినది దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఐఎంజి బోగస్ కంపెనీ చెప్పడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడారని తెలియజేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News