Sunday, April 13, 2025

కెసిఆర్‌కు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన రైల్‌రోకో కేసును ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో రైల్‌రోకో నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా కెసిఆర్‌ను 13వ నిందితుడిగా రైల్వే పోలీసులు చేర్చారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధుల కోర్టులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేసును కొట్టివేయాలం టూ కెసిఆర్ పిటిషన్ దాఖలు చేశారు. రైల్‌రోకో జరిగిన సమయంలో కెసిఆర్ సంఘటన స్థలంలో లేరని ఆయన తరపు న్యాయవాది వాదిం చారు. కెసిఆర్ పిలుపుతోనే రైల్‌రోకో నిర్వహించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కెసిఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News