- Advertisement -
వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఆదివారం గుజరాత్ జట్టును ఢీకొట్టబోతోంది. ఇవాళ ఐపిఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యచ్ జరగనునంది. సొంత గ్రౌండ్ ఆడిన తొలి మ్యాచ్ లో గెలిచిన సన్ రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్ లో ఘోరంగా ఓటమిపాలైంది. ఇవాళ మరోసారి హోంగ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
మరోవైపు, వరుస విజయాల జోరుమీదున్న గుజరాత్ కూడా హైదరాబాద్ ను చిత్తు చేయాలని భావిస్తోంది. గుజరాత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడగా.. ఒక తొలి మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయింది. మిగతా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, సన్ రైజర్స్ జట్టు మాత్రం చివరిస్థానానికి పడిపోయింది.
- Advertisement -