ముంబై: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చెత్త కామెంట్స్ చేసి ఓ నిర్మాత విమర్శలు ఎదురుకుంటున్నాడు. ‘స్త్రీ-2’మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు హీరోయిన్ శ్రద్ధా కపూర్. అయితే ఈ సినిమా కోసం ఆమెను ఎలా ఎంపిక చేశారు అని డైరెక్టర్‌ని అడిగిన ప్రశ్న.. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతకు తలనొప్పిగా మారింది. ఈ చిత్రానికి ఆమెను ఎంపిక చేసుకోవడంపై దర్శకుడు అమర్ కౌశిక్ మాట్లాడుతూ.. శ్రద్ధాను ఎంపిక చేసింది తాను కాదని.. నిర్మాత దినేశ్ విజయ్ అని పేర్కొన్నారు.
ఒకసారి దినేశ్, శ్రద్ధా కపూర్‌తో కలిసి ఫ్లైట్‌లో వెళ్లారని కౌశిక్ చెప్పారు. ఆ సందర్భంలో ఇద్దరు చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నారన్నారట. అప్పుడు శ్రద్ధా ఆమె అచ్చం దెయ్యంలా నవ్వుతుందని.. అందకే ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక అని దినేశ్ విజయ్ ఎంపిక చేసినట్లు కౌశిక్ తెలిపారు. దీంతో శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ దినేశ్ విజయ్‌ని ఏకిపారేస్తున్నారు.‘ఆమెను హీరోయిన్‌గా పెట్టి డబ్బులు సంపాదించిన నవ్వు.. ఇప్పుడు ఆమె నవ్వుపై ఇలా చెత్తగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు’ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.