Tuesday, April 8, 2025

ప్రియురాలితో మహిళ క్రికెటర్ వివాహం

- Advertisement -
- Advertisement -

మహిళ క్రికెట్‌లో స్వలింగ వివాహాలు కామన్ అయిపోయాయి. ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డెనర్ స్వలింగ వివాహం చేసుకుంది. 2021 నుంచి ఆష్లీ.. మోనికా రైట్ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు గతేడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తాజాగా వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లికి స్టార్ క్రికెటర్లు అలిస్సా హేలీ, ఎల్లీస్ పెర్రీ, కిమ్ గార్త్, ఎలీస్ విల్లా తదితరులు హాజరయ్యారు. ఇక గార్డెనర్ ఆస్ట్రేలియాలో కీలక ప్లేయర్‌గా కొనసాగుతుంది. దీంతో పాటు.. మహిళల ఐపిఎల్‌లో గుజరాత్‌ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News