Tuesday, April 8, 2025

డిలిమిటేషన్‌పై మా భయాలను పరిహరించాలి

- Advertisement -
- Advertisement -

తమిళనాడు హక్కుల రక్షణకు పార్లమెంట్‌లో తీర్మానం ఆమోదించాలి
ప్రధాని మోడీకి ఊటీ సభలో స్టాలిన్ డిమాండ్

ఉదకమండలం : ప్రతిపాదిత డిలిమిటేషన ప్రక్రియకు సంబంధించిన తమిళనాడు ప్రజల భయాలను ప్రధాని నరేంద్ర మోడీ పరిహరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదివారం కోరారు. ఉదకమండలంలో ఒక అధికారిక కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు హక్కులను ఏమాత్రం నియంత్రించరన్న హామీతా పార్లమెంట్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించేలా మోడీ చూడాలని అన్నారు. ఉదకమండలంలో కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త పథకాలను ప్రకటించిన తరువాత స్టాలిన్ ప్రసంగిస్తూ, ప్రతిపాదిత డిలిమిటేషన్‌కు సంబంధించిన ఆందోళనలతో ఒక వినతిపత్రం సమర్పణకు ప్రధానితో భేటీకి సమయం కోరానని తెలియజేశారు.

‘డిలిమిటేషన్‌పై వినతిపత్రం సమర్పణకు ఒక అపాయింట్‌మెంట్ కోరాం& నేను ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నందున ప్రధానితో సమావేశంలో పాల్గొనలేని నా అశక్తత గురించి ఆయనకు తెలియజేసి, మా మంత్రులు తంగం తెన్నరసు, రాజా కన్నప్పన్‌లను పంపాను. ఈ సమావేశం ద్వారాను, మీ ద్వారాను డిలిమిటేషన్ భయాలను పరిహరించవలసిందిగా ప్రధానికి ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని స్టాలిన్ సభికులతో చెప్పారు. ‘ఈ విషయమై పార్లమెంట్‌లో ఒక తీర్మానం ఆమోదించేలా కూడా మీరు (మోడీ) చూడాలి. ఇది (డిలిమిటేషన్) పార్లమెంటరీ సీట్ల తగ్గింపునకు దారి తీయడమే కాకుండా మా భవిష్యత్తు గురించి కూడా ఇది ఆందోళనకరం అవుతోంది’ అని ఆయన చెప్పారు. ‘పుదుచ్చేరి సహా 40 పార్లమెంటరీ సీట్లు ఉంటాయి. కానీ అధికార బిజెపి ప్రభుత్వం డిలిమిటేషన్ మా గొంతు నొక్కాలని చూస్తోంది’ అని ఆయన అన్నారు. నిష్పాక్షిక డిలిమిటేషన్‌పై సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశాన్ని మార్చి 22న నిర్వహించాం.

దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నాయకులు సమావేశానికి హాజరయ్యారు’ అని ఆయన తెలిపారు. జనాభా వృద్ధిని సమర్థంగా నియంత్రించిన ఇతర రాష్ట్రాలతో పాటు తమిళనాడును రానున్న డిలిమిటేషన్ ప్రక్రియలో శిక్షించడం జరగదని ప్రధాని మోడీ విస్పష్ట హామీ ఇవ్వాలని స్టాలిన్ సభలో ఉద్ఘాటించారు. డిలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన ఏకైక రాష్ట్రం తమిళనాడు అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ‘(ప్రస్తుత రూపంలో డిలిమిటేషన్)ను సాగించినట్లయితే, రాష్ట్రానికి పార్లమెంట్‌లో భారీ నష్టం వాటిల్లుతుంది’ అని స్టాలిన్ హెచ్చరించారు. స్టాలిన్ అంతకుముందు రూ. 143.69 కోట్ల పెట్టుబడితో జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో నిర్మించిన కొత్త 700 పడకల ఆరోగ్య సేవ కేంద్రాన్ని ప్రారంభించి, తనిఖీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News