Tuesday, April 8, 2025

బిఆర్‌ఎస్‌తో ఒప్పందం… బలం లేని చోట బిజెపి ఎలా గెలుస్తుంది: పొన్నం

- Advertisement -
- Advertisement -

ఒప్పందంలో భాగమే ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి పోటీ
బలం లేని చోట బిజెపి ఎలా గెలుస్తుంది…? –
తాము బిజెపికి మద్దతివ్వం : మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో ఒప్పందంలో భాగంగానే బిజెపి నామినేషన్ వేసిందని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ స్థానిక సంస్థలకు ఉన్న మొత్తం 112 ఓట్లలో బిజెపికి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయని, బిఆర్‌ఎస్ – 23, కాంగ్రెస్ -13, ఎంఐఎం -49 ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. తమకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదని పొన్నం పేర్కొన్నారు. అప్పుడు బిజెపి గెలుపు ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అభ్యర్థిని పెట్టలేదని, తాము బిజెపికి మద్దతిచ్చే పరిస్థితి లేదని, ఆ పరిస్థితి రాదని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తాము తటస్థంగా ఉన్నామని, అలా అని ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదన్నారు. అలాంటప్పుడు బిఆర్‌ఎస్ బిజెపి కి మద్దతు తెలుపుతుందా అని ఆయన ప్రశ్నించారు. మీ ఇద్దరి రాజకీయ అవగాహన మేరకే నామినేషన్ వేశారా ?, బిజెపి ఎలా గెలుస్తుంది ? , క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వైఖరి పై ఆ పార్టీ ఎంఎల్‌ఎ రాజసింగ్ విమర్శల నేపధ్యంలో కిషన్ రెడ్డి బిఆర్‌ఎస్ నాయకునికి బినామీ గా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. .ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బిజెపికి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపిందని, ఇప్పుడు కూడా బిజెపి కి ఇంటర్నల్ గా మద్దతు తెలిపేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News