Tuesday, April 8, 2025

టామ్ బాంటన్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

లండన్: ఐపిఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా ఓ ఇంగ్లండ్ ఆటగాడు అద్బుతం చేశాడు. ఎన్నో ఆశలతో ఐపీఎల్లో ఆడాలనుకున్న నిరాశే మిగిలిన టామ్ బాంటన్ బ్యాట్ ఝలిపించి పరుగుల వరద పారించాడు. ప్రస్తుతం సోమర్‌సెట్‌తె జరిగిన కౌంటీ డివిజన్1 మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఈ స్టార్ ప్లేయర్.. ఏకంగా 150 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేశాడు. కౌంటీడివిజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అతను వోర్సెస్టర్‌షైర్‌పై ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. 381 బంతుల్లో 344 పరుగులు.. రెండో రోజు ముగిసే సమయానికి, టామ్ బాంటన్ 381 బంతులు ఎదుర్కొని 53 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 344 పరుగులు చేశాడు. అతను ఇప్పటి వరకు మొత్తం 496 నిమిషాలు బ్యాటింగ్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News