Tuesday, April 8, 2025

8న ముంబైలో ‘ఓదెల 2’ ట్రైలర్ లాంచ్..

- Advertisement -
- Advertisement -

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ అప్‌డేట్‌తో వచ్చారు. ఓదెల2 థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 8న ముంబైలో జరిగే అద్భుతమైన ఈవెంట్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. కోర్ టీమ్ హాజరు కానున్న ఈ కార్యక్రమంలో టీమ్ తెలుగు, హిందీ ట్రైలర్‌లను లాంచ్ చేయనుంది.

ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. టీజర్‌ను కుంభమేళాలో లాంచ్ చేశారు. ఇప్పుడు, ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ముంబైని ఎన్నుకున్నారు. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఓదెల 2 ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లో ఒకటిగా నిలుస్తుంది. తమన్నా భాటియా నాగ సాధువుగా అద్భుతంగా నటించి పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోశారు. హెబ్బా పటేల్, వసిష్ట ఎన్ సింహా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News