Tuesday, April 8, 2025

ఘన విజయం దిశగా ‘ఎల్ వై ఎఫ్’

- Advertisement -
- Advertisement -

తాజాగా విడుదలైన ‘ఎల్‌వైఎఫ్’ చిత్రం ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలకి ముందే ట్రైలర్‌తో ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమాలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించారు. ఎస్ పి చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మించాయి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు మూవీ టీం సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ముందుగా హీరో హర్ష మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా సినిమా చూడని వారుంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి. తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..‘ సినిమా చాలా బాగుందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇంత చిన్న సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చాలా మంది ఫోన్లు చేసి తమకు ఈ సినిమా చూశాక వాళ్ళ తండ్రి గుర్తొస్తున్నారు అని చెప్పారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు.

నిజంగా ఈ సినిమాకి ఇంతలా కనెక్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది’ అని తెలిపారు. నిర్మాత కిషోర్‌రాఠి మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగుందని చూసినవారు అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనీషా ఆర్ట్స్ బ్యానర్‌లో గత నలభై ఏళ్లుగా ఇలాంటి కుటుంబ కథ చిత్రాలే తీస్తున్నాం. వాటిలో చాలా వరకు ప్రేక్షకుల ఆదరణలు పొందాయి. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. అందుకు ప్రేక్షకులకు చాలా థాంక్స్. ఇంతమంచి సినిమా తీసినందుకు డైరెక్టర్ పవన్ కి కూడా నా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News