Tuesday, April 8, 2025

ధోనీ.. ఉన్న పేరు చెడగొట్టుకోవద్దు: పాక్ మాజీ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోనీ ఆటతీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వికెట్ కీపర్‌గా ఆకట్టుకుంటున్న ధోనీ.. బ్యాట్స్‌మెన్‌గా మాత్రం విఫలమవుతున్నారు. దీంతో కొందరు మాజీలు ధోనీ ఇంకా జట్టు నుంచి తప్సుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.

తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ధోనీ రిటైర్‌మెంట్ గురింిచ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ధోనీ చాలా రోజుల క్రితమే రిటైర్ అవ్వాల్సిందని రషీద్ పేర్కొన్నారు. ఇప్పుడు అతను ఆడయుడున్న జిడ్డు ఆట తీరు వల్ల తనకి ఉన్న పేరు చెడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్లు 35 ఏళ్లు దాటిన తర్వాత ఆడలేరని.. దానికి తానే ఓ ఉదాహరణగా అని రషీద్ తెలిపారు.

అయితే ధోనీ మాత్రం తను ఇప్పట్లో రిటైర్‌మెంట్ ప్రకటించను అని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం ఐపిఎల్‌ ఆడే విషయాన్ని ప్రతీ సంవత్సరం సమీక్షించుకుంటానని.. తన శరీరం సహకరిస్తే.. ఆడుతానని.. లేదంటే మానేస్తానని ధోనీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News