- Advertisement -
హైదరాబాద్: కేంద్రం హైదరాబాద్ మెట్రోకు నిధులు అడిగితే ఇవ్వట్లేదని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణాకు బిజెపి నేతలు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పునర్జీవానికి నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీల గురించి కేంద్రమంత్రులు ఎప్పుడైనా మాట్లాడారా?నని ప్రశ్నించారు. మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని తెలియజేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని ధ్వజమెత్తారు. గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వటం లేదా?నని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.
- Advertisement -