- Advertisement -
ఢిల్లీ: ఇంధన ధరలు పెంచి వాహనదారులకు మోడీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై రెండు రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46, డీజిల్ ధర రూ.95.70 గా ఉంది. ఇందనం ధరలు తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇంధనం ధరలు పెరిగితే నిత్యావసర ధరలు భగ్గుమంటాయని మధ్య తరగతి, పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచడంతో మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోవడంతో మదుపరులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. బంగారం ధర కూడా లక్ష రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో క్రూడ్ అయిల్ ధరలు కూడా పతనం అవుతున్నాయి.
- Advertisement -