Tuesday, April 8, 2025

వాతావరణంలో మార్పులు.. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ మధ్య బంగాళఖాతంలో ఏర్పిడిన అల్పపీడం కారణంగా ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయని సమాచారం. ఉపరితల ద్రోణి తూర్పు బీహార్ నుంచి ఈశాన్య జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ కొనసాగనుంది. దీని ప్రభావంతో హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిసాయి. మహబూబ్‌నగర్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News