Tuesday, April 8, 2025

వరంగల్‌లో మెగా జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

ఈ నెల 11న వరంగల్‌లో మెగా జాబ్ మేళా : ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కొండా సురేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 11న వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకుల కోసం టాస్క్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళాను అంతా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌లోని తన నివాసంలో జాబ్ మేళా నిర్వాహకులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టాస్కు సీఈఓ శ్రీకాంత్ సింహ, సీఆర్‌ఓ ప్రదీప్ రెడ్డి, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఓఎస్డీ నార్ల సుమంత్, స్పెషల్ ఆఫీసర్ శ్రీరాముల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ జాబ్ మేళకు హాజరవుతున్న కంపెనీల వివరాలను మంత్రి సురేఖకి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యధిక నిరుద్యోగ యువతకి ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. జాబ్ మేళాకి హాజరయ్యే వారికి భోజనం, మంచి నీటి ఏర్పాటు చేయాలని సూచిస్తూ అందుకోసం తాను వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా సహకారం అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఎండలు బాగా ఉన్నాయని, జాబ్ మేళాకు హాజరయ్యే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని, అక్కడ రెండు లేదా మూడు అంబులెన్స్‌లు ఉంచాలని చెప్పారు. ఎవరికైనా నిరుద్యోగులకు ఆ సమయంలో అనారోగ్యం లేదా అస్వస్థత ఏర్పడితే వారికి వైద్య సదుపాయం అందించవచ్చని మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్, పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది రాకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సురేఖ వెల్లడించారు. కాగా వరంగల్ జిల్లా యువతీ యువకులందరూ మెగా జాబ్ మేళాలో పాల్గొని, తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్వాహకులు ఇటీవల మంత్రి చేత విడుదల చేయించిన పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 11న ఉదయం 9.30 గంటల నుండి వరంగల్‌లోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్‌లో ప్రారంభం అవుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News