2013నాటి కేసులో దోషులను తేల్చనున్న హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలు ళ్లు చోటు చేసుకున్న విషయం విదితమే. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు, 130 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాం తులకు గురిచేసింది. 2016లో ఎన్‌ఐఎ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది.
అయితే కింది కోర్టు తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. 21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఎ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండి యన్ ముజాహిద్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందుల్లో అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్‌ను 2013లో నేపాల్ సరిహ ద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.