Wednesday, April 16, 2025

అమెరికా ఎయిర్ పోర్ట్ లో భారతీయ మహిళ నిర్బంధం

- Advertisement -
- Advertisement -

భారతీయ మహిళకు అమెరికా ఎయిర్ పోర్ట్ లో తీవ్ర అవమానం జరిగింది. వేధింపులకు గురైంది. సెక్యూరిటీ సిబ్బంది చలిగా ఉండే గదిలో ఆమెను నిర్బంధించి, ఓ పురుష అధికారి, చలినుంచి కాపాడుకునేందుకు ఆమె వేసుకున్న దుస్తులను తొలగించి, శారీరకంగా తనిఖీచేశారు. కనీసం హ్యాండ్ బ్యాగ్ కానీ, పర్స్ కానీముట్టుకోనివ్వలేదు. ఎవరికీ ఫోన్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఆమె లగేజీ పూర్తిగా చిందరవందర చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రశ్నలవర్షం కురిపించారు. ఫలితంగా ఆమె తాను ఎక్కాల్సిన విమానం మిస్ చేసుకుంది. ఇంతకీ ఆమె హ్యాండ్ బ్యాగ్ లో -పవర్ బ్యాంక్ – కనిపించడమే ఈ సెక్యూరిటీ హడావుడికి కారణం. అలాస్కాలోని యాంకరేజ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తాను అనుభవించిన టార్చర్ ను వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేసి, అమెరికా పోలీసులు, ఎఫ్ బీఐ సెక్యూరిటీ చేతిలో ఏడు గంటలపాటు తాను నరకం అనుభవించానని తన ఆవేదన పంచుకుంది.అమె ఇండియన్ యాక్షన్ ప్రాజెక్టు, చాయ్ పానీ వ్యవస్థాపకురాలు. తన వద్ద అనుమానించాల్సిన వస్తువేదీ కన్పించకపోవడంతో 8 గంటల నరకం తర్వాత తనను, తన స్నేహితురాలిని విడిచి పెట్టారని, అమెరికానుంచి బయటపడిన తర్వాతే తాను తనకు జరిగిన ఘోరఅవమానాన్ని పోస్ట్ చేస్తున్నానని శ్రుతి చతుర్వేది వివరించారు. శ్రుతి పోస్ట్ తో విదేశాలలో భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై ఆందోళన వ్యక్తమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News