Wednesday, April 16, 2025

దేశం.. ద్వేషమయం

- Advertisement -
- Advertisement -

బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ ధ్వజం
సిడబ్లూసి సమావేశంలో తీర్మానం
ఆమోదం సామాజిక న్యాయపథంలో
సాగాలని ప్రతిజ్ఞ డిసిసి అధ్యక్షులకు
సాధికారతపై త్వరలో కార్యాచరణ
కాంగ్రెస్‌కు మార్గదర్శి సర్దార్ పటేల్
జాతీయ హీరోలపై బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్
కుట్ర : మల్లికార్జున ఖర్గే

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధా నం, ఆశ్రమ విశిష్టతలను సిఎం అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో గాం ధీ వాడిన చరఖాను తిప్పి దానిని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రా ర్థనలో సిఎం పాల్గొన్నారు. కాగా, గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగే రెండు రోజుల ఏఐసిసి ప్రత్యేక కార్యక్రమాలు, సీడబ్లూసీ సమావేశాల కోసం సిఎం రేవంత్ రెడ్డి గుజరాత్ వెళ్లారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఏర్పా టు చేసిన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.

ఎపి కాంగ్రెస్ నాయకులతో గ్రూపు ఫొటో
అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసిసి సమావేశాల్లో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఎపి కాంగ్రెస్ నాయకులతో సిఎం రేవంత్, డిప్యూటీ సిఎంలు గ్రూప్ ఫొటో దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News