Thursday, April 17, 2025

ఫేక్..షేక్!

- Advertisement -
- Advertisement -

హెచ్‌సియు భూముల వివాదంలో ఫేక్ ఫోటోలు,
వీడియోలు షేర్ చేసిన వారిలో వణుకు ఈ ఫోటోలు
షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును
ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం తన సోషల్ మీడియా
ప్లాట్‌ఫాం నుంచి ఫోటోలు తొలగించిన కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి ట్విట్టర్ నుంచి తొలగించిన మాజీ మంత్రి
జగదీశ్‌రెడ్డి అదే దారిలో పలువురు సెలబ్రిటీలు,
రాజకీయ నాయకులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిభూముల వివాదం సరికొ త్త మలుపు తిరిగింది. హెచ్‌సియూ భూమిలో జింకలు, నెమళ్లు ఉన్న ట్టు కొందరు సృష్టించిన ఏఐ ఫొటోలు, వీడియోలు ఫేక్ అని తేలడం తో ప్రస్తుతం సెలబ్రేటీల నుంచి రాజకీయ నాయకుల వరకు వాటిని తమ సోషల్‌మీడియాలో డీలేట్ చేసే పనిలో పడ్డారు. ఇందులో ఒక ఏఐ ద్వారా సృష్టించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వివాదస్పదం అ య్యింది. ఈ ఫొటోను సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మా జీ మంత్రి జగదీశ్ రెడ్డి, బిఆర్‌ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేశా రు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, మూగ జీవాలను కాపాడాలని పలువురు వారికి మద్ధతుగా పోస్టులు పెట్టారు. ఈ వీడియోలు, ఫొ టోలను ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి,
ప్రధాని నరేంద్ర మోడీకి ట్యాగ్ చేశారు. హెచ్‌సియూ భూములు కాపాడాలని సినిమా తారలు కూడా పోస్టులు పెట్టారు. అందరూ దాదాపుగా అదే ఫొటోను వాడారు. కొన్ని పత్రికలు కూడా ఆ ఫొటోను పతాక శీర్షికన ప్రచురించాయి.

సీన్ కట్ చేస్తే అది ఫేక్ ఫొటో అని దానిని ఏఐ క్రియేట్ చేసిందని తేలింది. బుల్డోజర్లు, పక్కనే ఎగురుతున్న నెమ్మళ్లు సమీపంలో ఉన్న జింకలు అంతా ఏఐ క్రియేషని పోలీసులు గుర్తించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫొటోలను షేర్ చేసిన బిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె క్రిశాంక్, దిలీప్ కొణతంలకు నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఈ ఫొటోలను షేర్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో ఫేక్ వీడియోల వ్యాప్తికి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసిన ఈ ఫొటోలను డిలీట్ చేయగా, బిఆర్‌ఎస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో తొలగించడం గమనార్హం.

ఎక్కడో వేటాడిన జింకను….
దీంతోపాటు ఓ జింక కళేబరం పడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ ఫొటో కూడా నకిలీదని సైబర్ క్రైం అధికారుల విచారణలో తేలింది. అందులో జింక కాళ్లు కట్టేసి ఉన్నాయని, అది ఎక్కడో వేటాడిన జింక అని పేర్కొన్నారు. దానికి, కంచ గచ్చిబౌలి భూములకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఫొటోనూ బిఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ పోస్టు చేశారు. అదే ఫొటోను పొరపాటున పోస్ట్ చేశానని, క్షమించాలంటూ జర్నలిస్ట్ సుమిత్ ఝా ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌ను కూడా సైబర్ క్రైం అధికారులు విడుదల చేశారు.

హెచ్‌సియూ భూముల్లో ఏకంగా ఏనుగులే ఉన్నట్టు….
సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో హెచ్‌సియూ భూముల్లో ఏకంగా ఏనుగులే ఉన్నట్టు కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. ఉమంగ్ జైన్ పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ లో ఏకంగా తీవ్రంగా గాయపడ్డ ఏనుగు ఫొటోనే పోస్టు చేయడం విశేషం. అడ్వకేట్ జానీ వర్మ పేరుతో ఉన్న హ్యాండిల్ లో ఏకంగా ఓ ఏనుగుల గుంపు వెళ్తున్న వీడియో పోస్ట్ కావడం విశేషం.
సినీనటి దియామీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై చర్యల నిమిత్తం…
ఇదే కేసులో సినీనటి దియామీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏఐ జనరేటెడ్ ఫొటోలను షేర్ చేసినట్టు సిఎంఓ అధికారులు తెలిపారు. వారినైనా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలీవుడ్ నటీమణి దియా మీర్జా నటీమణి ఈ వివాదంపై స్పందించారు. తాను ఎలాంటి నకిలీ వీడియోలు, ఫొటోలు షేర్ చేయలేదని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్
సోషల్ మీడియాలో #SaveHCU, #SaveHCUBioDiversity, #HCU, #SaveKanchaGachibowli హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అయ్యాయి. ఈ హ్యాష్ ట్యాగ్స్ తో ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్టు సైబర్ క్రైం అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఫొటోలు, వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పలువురు షేర్ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News