- Advertisement -
హైదరాబాద్: ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్‌కు జంటగా జాన్వీకపూర్ నటిస్తున్నారు. పెద్ది చిత్రం సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే కథతో సినిమాను తీస్తున్నట్టుగా తెలుస్తుంది. రామ్‌చరణ్ బ్యాట్ పట్టుకొని ఉత్తరాంద్ర యాసలో మాట్లాడటం బాగుంది. రామ్ చరణ్ చెప్పినట్లగానే ఎఐతో వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ చెప్పినట్లుగా అద్భుతంగా ఉందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే చరణ్ చెప్పిన విధంగా ఉందని కొనియాడుతున్నారు. వచ్చే సంవత్సరం మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.
- Advertisement -