Wednesday, April 16, 2025

అయోధ్య రామదర్బార్‌లో జూన్ 6 నుంచి భక్తులకు ప్రవేశం

- Advertisement -
- Advertisement -

అయోధ్యలోని రామాలయంలో జూన్ 6 నుంచి రామ్‌దర్బార్ భక్తులకు అందుబాటు లోకి రానున్నదని ఆలయ నిర్మాణ కమిటీ చీఫ్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. అయితే దీని ప్రారంభోత్సవం కోసం ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించడం లేదని చెప్పారు. ఈ ప్రక్రియతో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. 2020 లో అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభం కాగా, 2024లో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగింది. ఇంతవరకు రామ్‌లల్లా గా పూజలందుకుంటున్న విగ్రహాన్ని రాజారాంగా రామ్ దర్బార్‌లో ప్రతిష్ఠించనున్నట్టు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఫస్ట్‌ఫ్లోర్‌లో నిర్మిస్తున్న దర్బార్‌లో రాజారామ్‌ను ప్రతిష్ఠిస్తారు. మే 23న జరిగే కార్యక్రమంలో రాముడు, సీత, రాముడి సోదరుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారని మిశ్రా వెల్లడించారు. రామ్ దర్బార్ లోకి భక్తులకు ప్రవేశం కల్పించడానికి ముందు రకరకాల పూజలు జరుగుతాయని, జూన్ 5న అవి పూర్తవుతాయని జూన్ 6 నుంచి భక్తులకు ప్రవేశం ఉంటుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News