Monday, April 14, 2025

ఒలంపిక్స్ లో క్రికెట్ పోటీలు.. 6 జట్లకు చోటు!

- Advertisement -
- Advertisement -

ఈసారి జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్‌ లాస్ఏంజెలిస్ లో నిర్వహించనున్నారు. ఈ ఒలంపిక్స్ నుంచి క్రికెట్ ను చేర్చేందుకు నిర్వాహకులు అంగీకరించారు. దీంతో 2028 ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్ లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో 6 జట్ల చొప్పున పాల్గొనున్నాయి.

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-6 జట్లు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున మొత్తం 90మంది క్రికెటర్లకు అనుమతినిస్తూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది. కాగా, చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మళ్లీ 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News