మన తెలంగాణ/ మోత్కూర్: మోత్కూర్ మండలంలోని దాచారం గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నే వూ రి ధర్మేంధర్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే లు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ లు గురువారం పరామర్శించారు. నేవూరి ధర్మేంధర్ రెడ్డి తల్లి పిచ్చమ్మ ఇటీవల మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యేలు భిఆర్ఎస్ నాయకులు ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి కుటుంభ సభ్యులను పరామర్శించి,తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి,రాష్ట్ర నాయకులు చింతల వేంకటేశ్వర్ రెడ్డి,యాదాద్రి,సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లు ఎలిమినేటి సందీప్ రెడ్డి, గుజ్జ దీపిక యుగేందర్ రావు,మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ లు కొమ్మినేని సతీష్, రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి లుధర్మేంధర్ రెడ్డి ని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ లు చిప్పలపల్లి మహేంద్ర నాద్, కొనతం యాకూబ్ రెడ్డి, బీఆర్ ఎస్ మండల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, సంకేపల్లి రఘునందన్ రెడ్డి, కట్ట వెంకట్ రెడ్డి, గుండా శ్రీను, నాయకులు రాంపాక నాగయ్య, పొన్నాల వెంకటేశ్వర్లు,చౌగోని సత్యం గౌడ్,పానుగుళ్ల విష్ణు మూర్తి,గిరగాని శ్రీను,దాసరి తిరుమలేష్,మల్ల అనిత,కొండా సోమల్లు,అండెం రాజిరెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బందెల శ్రీను,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.