- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం కురిసిన వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శని వారాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఇక సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- Advertisement -