Saturday, April 19, 2025

24వేల ఎకరాల్లో పంట నష్టం

- Advertisement -
- Advertisement -

రైతులు అధైర్యపడొద్దు…ప్రభుత్వపరంగా ఆదుకుంటాం
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట
నష్టం వివరాలు సేకరిస్తున్నాం అత్యధికంగా సిద్దిపేట
జిల్లాలోనే పంట నష్టం నష్టపోయిన పంట వివరాలు
త్వరితగతిన నమోదు చేయాలి వ్యవసాయ శాఖ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర వ్యాప్తంగా గత 3, 4 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 24 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇందులో ఎక్కువగా సిద్దిపేట జిల్లాలోనే పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం, ఇబ్రహీంనగర్‌లో శుక్రవారం పర్యటించి ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు నష్టపోయిన పంటలను పరిశీలించి మాట్లాడారు. రైతులు అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలకు సేకరిస్తున్నామన్నారు. గత 3, 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వడగండ్ల వానతో రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటల వివరాలను త్వరతగతిన సేకరించి ప్రభుత్వానికి పంపాలన్నారు. తమ ప్రభుత్వం రైతు సర్కార్ అని అన్నారు. మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ మను చౌదరి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాధిక, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతితులు, నాయకులు, రైతులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News