Wednesday, April 16, 2025

బస్సు కింద పడి వ్యక్తి మృతి.. ట్రాఫిక్ పోలీసులపై జనం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబద్: బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌పై వెళ్తు్న వ్యక్తి.. ఆర్టిసి బస్సు కిందపడి మృతి చెందాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసలు బైక్‌ను ఆపే ప్రయత్నం చేయగా.. బైక్ అదుపు తప్పి వ్యక్తి కిందపడ్డాడు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న బస్సు అతడి తల మీద నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు ఘటనస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. వాగ్వాదానికి దిని వారిని చెరగొట్టారు. మృతి చెందిన వ్యక్తి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News