Wednesday, April 16, 2025

హైదరాబాద్ ను మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిల్డర్ల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కన్ స్ట్రక్షన్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ‘సైబరాబాద్ బిల్డర్ల అసోసియేషన్’ వార్షికోత్సవ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి బిల్డర్లు కృషి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ ను మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని, పెట్టుబడులకు అనుకూలంగా ఫ్యూచర్ సిటిని తీసుకొస్తున్నామని తెలియజేశారు. సైబరాబాద్ బిల్డర్ల అసోసియేషన్ కు తాము మరింత భరోసా ఇస్తున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల దృష్ట్యా మరిన్ని భవనాలు నిర్మించాలని కోరారు. అందరూ బిల్డర్స్ ప్రభుత్వంలో ఎప్పటికీ భాగస్వాములేనని, ప్రభుత్వ అభివృద్ధిలో బిల్డర్ల పాత్ర ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. బిల్డర్లకు ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉంటుందని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News