Wednesday, April 16, 2025

ఉక్రెయిన్‌లోని భారత ఫార్మా గిడ్డంగిపై రష్యా దాడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌తో ప్రత్యేకమైన స్నేహబంధం ఉందని అంటూనే ఉక్రెయిన్‌లోని భారత ఫార్మా గిడ్డంగిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ రాయబారి ఆరోపించారు. శనివారం కీవ్ నగరంలోని ప్రముఖ ఫార్మా సంస్థ ‘కుసుమ్’ గోడౌన్‌ను లక్షంగా చేసుకుని మరీ రష్యా క్షిపణి దాడి చేసిందని ఆయన విమర్శించారు. ఈ డాడిలో గోడౌన్ మొత్తం నాశనమైందని ఆయన తెలిపారు, చిన్న పిల్లలు, వృద్ధులకు అవసరమైన మందులు నిల్వ చేసిన గిడ్డంగి పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ ఎంబసీ ఆరోపించింది. ఇది ఒక్కటే కాదు& ఉక్రెయిన్‌లోని భారత వ్యాపార సంస్థలను టార్గెట్ చేసి ర ష్యా దాడులు చేస్తోందని ఎంబసీ ఆరోపించింది. అయితే, ఈ విషయమై భారత, రష్యా ప్రభుత్వాలు ఇంకా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం కూడా ఒక ట్వీట్ చేసింది.

కీవ్ నగరంలోని ఒక ప్రముఖ ఫార్మా సంస్థ గోడౌన్‌పై రష్యా దాడి చేసిందని, అయితే, అది క్షిపణి దాడి మాత్రం కాదని, డ్రోన్ల దాడి అని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ తెలియజేశారు. గోడౌన్‌లో చిన్నారులకు, వృద్ధులకు అత్యవసరమైన మందులు నిల్వ చేసినట్లు హారిస్ తెలిపారు. గిడ్డంగిగా కనిపిస్తున్న ఒక భవనంలో నుంచచి వెలువడుతున్న పొగ, ఆ ప్రదేశంలో ఒక ఫైరింజన్‌ను చూపుతున్న ఒక ఫోటోను హారిస్ తన ట్వీట్‌లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ శనివారం రష్యన్ ఇంధన శక్తి మౌలికవసతులపై ఐడు దాడులు జరిపిందని, అటువంటి దాడులపై యుఎస్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒడంబడికకు విరుద్దంగా ఇది జరిగిందని రష్యన్ రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం ఆరోపించింది. కాగా, ఉక్రెయిన్‌లోని ప్రముఖ ఫార్మా సంస్థల్లో ఒకటైన కుసుమ్ ఫార్మా యజమాని భారత్‌కు చెందిన రాజీవ్ గుప్తా అని అధికార వర్గాల సమాచారం, గోడౌన్‌పై దాడికి సంబంధించి రాజీవ్ గుప్తా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News