- Advertisement -
హైదరాబాద్: తనకు మంత్రి పదవి ఇస్తామంటే సీనియర్ నేత జానా రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్ఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి 25 ఏళ్లపాటు మంత్రి పదవిలో లేరా?అని ప్రశ్నించారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానని తెలిపారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ అడుక్కోలేదని అన్నారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటి? అని, సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -