Wednesday, April 16, 2025

ఉక్రెయిన్ సుమీలో రష్యన్ దాడిలో 20 మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఆదివారం రష్యన్ క్షిపణి దాడిలో 20 మందికి పైగా హతులయ్యారని అధికారులు వెల్లడించారు. జనం పామ్ సండే వేడుక కోసం సమీకృతం కాగా ఉదయం సుమారు 10.15 గంటలకు నగరం నడిబొడ్డున రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడి జరిగిందని అధికారులు తెలియజేశారు. అధికార చానెళ్లలో ఆ ఘటనకు సంబంధించిన వీడియోల్లో సుమీ నగర మధ్యంలో శిథిలాల మధ్య నేలపై పడి ఉన్న మృతదేహాలు. దట్టంగా వెలువడుతున్న పొగ కనిపించాయి. ‘ఈ చక్కని పామ్ సండే రోజు మా సమాజం దారుణ విషాదానికి గురైంది’ అని తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘దురదృష్టవశాత్తు మా దృష్టికి ఇప్పటికే 20 పైగా మరణాలు వచ్చాయి’ అని ఆయన తెలిపారు. ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రాథమిక దర్యాప్తు ఫలితాలను ఉటంకిస్తూ, దాడి ఫలితంగా కనీసం 21 మంది మరణించారని తెలిపారు. ఏడుగురు పిల్లలతో సహా మరి 83 మంది వ్యక్తులు గాయపడినట్లు ఉక్రెయిన్ దేశీయాంగ శాఖ మంత్రి ఇహోర్ క్లైమెంకో సోషల్ మీడియాలో తెలియజేశారు. రక్షణ, సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. రెండు క్షిపణుల దాడిలో ‘డజన్ల కొద్దీ’ మృతి చెందారని ఆయన తెలిపారు. ఈ దాడికి ప్రపంచం స్పందించాలని జెలెన్‌స్కీ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News