జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో పకడ్బందీగా బౌలింగ్ చేసింది. పెద్దగా వికెట్లు తీయకపోయినా.. పరుగులు మాత్రం భారీగా సమర్పించుకోలేదు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ బెంగళూరు బౌలర్ల నుంచి పరుగులు రాబట్టలేకపోయింది. 49 పరుగుల జట్టు స్కోర్ వద్ద సంజూ శాంసన్(15) ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రియాన్ పరాగ్ ఉన్నంతలో బాగానే ఆడాడు. మరోవైపు జైస్వాల్ బెంగళూరు బౌలర్ల నుంచి పరుగులు రాబట్టే ప్రయత్నంలో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న పరాగ్(30) యష్ దయాల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ధృవ్ జురేల్, జైస్వాల్‌తో భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ హెజెల్‌వుడ్ బౌలింగ్‌లో జైస్వాల్(75) ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. ఈ దశలో ధృవ్(35( జట్టుకు అండగా నిలిచాడు. వికెట్ కాపాడుకుంటూ పరుగులు రాబట్టాడు. అతనికి మద్దతుగా ఉన్న హట్మైర్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు పరగులు చేసింది. బెంగళూరు బౌలింగ్‌లో భువనేశ్వర్, యష్, హెజల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.