Tuesday, April 29, 2025

కమిషన్ నోటీసులు ఇవ్వడం ఇదే ప్రథమం: రాకేశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిజిపిఎస్సికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బిఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి అన్నారు. టిజిపిఎస్సి తనకు పరువునష్టం నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలను బయటపెట్టామని పేర్కొన్నారు. కానీ, వాటిపై టిజిపిఎస్సి సమాధానం చెప్పట్లేదని ఎద్దేవా చేశారు. కమిషన్ ఇలా పరువునష్టం నోటీసు ఇవ్వడం దేశంలోనే ప్రథమం అని తెలిపారు. నోటీసులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ అభ్యర్థులకు జవాబివ్వడంలో చూపించాలని సూచించారు.

టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఎందుకు లేడని ప్రశ్నించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌‌కు రెండు వేర్వేరు హాల్‌ టిక్కెట్స్ ఎందుకు ఇచ్చారని, మహిళలు, పురుషులకు వేర్వేరు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారని అడిగారు. 46 సెంటర్లుంటే 2,3 సెంటర్ల నుంచి టాపర్స్ ఎందుకు వచ్చారని, రిటైర్డ్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో గ్రూప్‌-1 పేపర్లు దిద్దిస్తారా? అని దుయ్యబట్టారు. గ్రూప్-1 అవకతవకలపై పోరాటం కొనసాగిస్తామని, అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని, అలా జరిపిస్తే.. అన్ని ఆధారాలు చూపిస్తామని స్ఫష్టం చేశారు. తాను కూడా టిజిపిఎస్సిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News