కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం, రాష్ట్రంలోనే అత్యంత పేదరిక రహితంగా ప్రకటించబడిన తొలి అసెంబ్లీ నియోజకవర్గంగా నిలిచింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి విజయన్ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘కేరళలో పేదరిక రహితంగా ప్రకటించిన తొలి అసెంబ్లీ నియోజకవర్గం ధర్మదం’ అని ఆయన పోస్ట్ పెట్టారు. ‘మన జనాభాలో ఒక శాతం కంటే తక్కువ మంది పేదరికంలో ఉన్నారు, నవంబర్ 1న మొత్తం రాష్ట్రాన్ని తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ప్రకటించడానికి మేము ప్రస్తుతం కృషి చేస్తున్నాము- ఇది మా సమ్మిళిత అభివృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయి #కేరళ మోడల్ ’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యల్ప పేదరికం రేటు కేరళలో ఉందని, ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే కృషి చేస్తోందని విజయన్ ఇదివరకే పేర్కొన్నారు. పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం రెండో నాల్గవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, 2025 నవంబర్ 1 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని కేరళ లక్షంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
పేదిరిక రహిత నియోజకవర్గంగా పినరయి విజయన్ నియోజకవర్గం
- Advertisement -
- Advertisement -
- Advertisement -