Thursday, April 17, 2025

గుల్జార్‌కి గలియోమె

- Advertisement -
- Advertisement -

జబ్ పుర్సత్ మిలే
మన్ కి బాత్ కహె దీజియే
బోహాత్ ఖామోష్ రిష్తీ
జ్యాదా దిన్ తక్ జిందా
నహీ రహెతే.

ఎప్పుడు దొరికినా కాసింత తీరిక
చెప్పేసెయ్యి మనసులోని మాటలన్నీ
నిశ్శబ్ద సంబంధాలన్నీ ఉండలేవు
సజీవంగా ఎక్కువ కాలం

శుక్ హై పరిందో కో నహీ పతా
ఉన్ కా మజహబ్ క్యా హై
వర్ణా ఆస్మా సే భీ
కూన్ కి బారీష్ హోతీ

ఇంకా నయం పక్షులకు
తెలియదు వాటి మతం ఏంటో
లేకుంటే ఆకాశం నుండి కూడా
కురిసేవినెత్తుటి వానలెన్నో

Gulzar's Galliome

నీంద్ ఆజాయే
తో సో భీ జాయా కరో
యూ రాతో మే జాగ్ నేసే
మహబూబ్ లౌటా నహీ కర్ తే

నిద్రొచ్చినప్పుడల్లా పడుకుంటూ ఉండు
రాత్రుళ్ళు ఇట్లా జాగారాలు చేసినంతనే
తిరిగిరాదు ప్రియురాలేమీ

నిబినా మాంగే హి మిల్
జాతీ హై మొహబ్బత్ కిసీ కో
కోయి హజారో దువాయే కే బాద్ భి
ఖాళీ రహే జాత హై

దొరుకుతుంది కొందరికి ప్రేమ అయాచితంగా
వేనవేల ప్రార్థనల తర్వాత కూడా
ఉండిపోతారు ప్రేమరాహిత్యంలో
ఇంకొందరు

అనువాదం: దేవులపల్లి అమర్

బొమ్మలు: దేవులపల్లి శృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News