Friday, April 18, 2025

ఓడితే ప్లేఆఫ్ కష్టమే!

- Advertisement -
- Advertisement -

లక్నోతో చెన్నై కీలకపోరు
లక్నో: ఐపిఎల్‌లో భాగంగా సోమవారం జరిగే కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నోతో పోరు చెన్నైకి సవాల్‌గా మారింది. ఈ సీజన్‌లో చెన్నై అనుకున్నంతగా రాణించలేక పోతోంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ పేలవ ఆటతీరుతో పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన చెన్నై కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి ఐదింటిలో పరాజయంపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది.

దీంతో సోమవారం జరిగూ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లో కూడా విజయం సాధించాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. గాయంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అపార అనుభవజ్ఞుడైన ధోనీ మళ్లీ కెప్టెన్సీ స్వీకరించడంతో చెన్నై దశ తిరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. మిగిలిన మ్యాచుల్లో భారీ తేడాతో విజయాలు సాధిస్తే తప్ప చెన్నై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో అందరి కళ్లు కెప్టెన్ ధోనీపైనే నిలిచాయి. ధోనీ జట్టును ఎలా ముందుకు తీసుకెళుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

విజయమే లక్షంగా..

గత రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన లక్నో సూపర్ జాయింట్స్ మూడో విజయంపై కన్నెసింది. హ్యాట్రిక్ విజయం సాధించాలతో పట్టుదలతో బరిలోకి దిగితోంది. గుజరాత్ జరగిన గత మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన లక్నో అంతకుముందు కోల్‌కతాతో జరిగిన పోరుతో 38 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. అదే జోరుతో ఈ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. లక్నో జట్టులో మిఛెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, బడోని వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. గుజరాత్ జరిగిన మ్యాచ్‌లో కాస్తా కుదురుగా ఆడినట్టు కనిపించిన అనవసరపు షాట్ ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇక మ్యాచ్‌లోనైనా బ్యాట్ ఝలిపిస్తే లక్నో భారీ స్కోరు చేయడం ఖాయమనే చెప్పొచ్చు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా పంత్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. అప్పుడే జట్టు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News