Friday, April 18, 2025

డూప్స్ లేకుండా స్టంట్స్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్త్తున్న స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్త్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నాడు. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా అప్‌డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుందట. ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి డూప్స్ లేకుండా స్టంట్స్ చేస్తాడని సమాచారం. ్రప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఇది పూర్తి కాగానే, సందీప్ రెడ్డి వంగా అక్టోబర్ నెలలో ‘స్పిరిట్’ సినిమాను ప్రారంభిస్తాడట. ఈ సినిమా స్క్రిప్ట్ రాయడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టడంతో షూటింగ్ ఆలస్యమైంది. ‘స్పిరిట్’ సాధారణ పోలీసు థ్రిల్లర్ కాదు, ఈ మూవీతో దర్శకుడు సరికొత్త ట్రెండ్ సెట్ చేయనున్నాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ షురూ చేసేముందు ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్టులు ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’లను పూర్తి చేయనున్నారట. ఈ సినిమా కోసం ప్రభాస్ తన బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ చేస్తాడని సమాచారం. అయితే ప్రభాస్ గత సినిమాల్లో డూప్స్ లేకుండా ఎక్కువగా స్టంట్స్ చేసేవారట. కానీ ‘స్పిరిట్’లోని చాలా స్టంట్స్‌ను ప్రభాస్ చేత చేయించాలనేది దర్శకుడి ఆలోచన అని తెలిసింది. స్పిరిట్’ను 2027లో రిలీజ్ చేయనున్నారు.

కీలక పాత్రలో మమ్మూట్టి..

ఇక మలయాళ మెగాస్టార్ మమ్మూట్టిని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తీసుకుంటారట. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగాలతో కలిసి భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News