- Advertisement -
అమరావతి: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారని..సమానత్వం, సాధికారతను అందించారని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. తమ పాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశామన్నారు. అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం కోసం ఎప్పడూ పనిచేస్తామని తెలియజేశారు. అంబేద్కర్ ఆశయాలు భవిషత్ తరాలకు స్ఫూర్తిదాయకమని జగన్ పేర్కొన్నారు.
- Advertisement -