Wednesday, April 16, 2025

అక్కడ ఎలాంటి తప్పు జరగరాదనేది మా లక్ష్యం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంట్లోనే విద్యుదుత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో చంద్రబాబు పర్యటించారు. పి4 కార్యక్రమాల లబ్ధిదారులతో సిఎం సమావేశం జరిపారు. పొన్నెకల్లులో ప్రజల ఆదాయం పెరిగేందుకు కార్యాచరణ సిద్ధం అని చెప్పారు. 369 పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 11 మంది వచ్చారని, పేద కుటుంబాలు ఎదిగే వరకు మార్గదర్శులు చేయూత ఇవ్వాలని కోరారు. పి4 కార్యక్రమం విజన్ 2047 సాధనకు ఉపయోగపడుతుందని తెలియజేశారు.

ఏదైనా నిర్మించడం చాలా కష్టం.. ధ్వంసం చేయడం సులభం అన్నారు. పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని, కోడికత్తి డ్రామా ఆడారని విమర్శించారు. వివేకాను చంపినట్లు చెప్పారని, అవన్నీ అబద్ధాలని తేలిందన్నారు.ఇప్పుడు తిరుమల గోశాలలో ఆవుల మృతిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి తప్పు జరగరాదనేది మా లక్ష్యమని, వెంకన్నను వ్యతిరేకంగా చేసిన వారే తప్పుడు ప్రచార్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News