చంచల్‌గూడ జైలులో భద్రతా లోపం మరోసారి బహిర్గతమైంది. ఓ కేసులో రిమాండ్‌లో ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని స్నేహితులు మూలాఖత్‌లో రీల్సే చేశారు. ఆ రీల్ కాస్త వైరల్ అవడంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పాతబస్తీకి చెందిన అహ్మద్ జాబ్రీ ఈనెల 11న దారిదోపిడీ కేసులో అరెస్టయ్యి చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జాబ్రీని కలవడానికి అతని మిత్రబృందం జైలుకు వెళ్ళింది. అక్కడ మూలాఖత్ సమయంలో జాబ్రీతో కలిసి రీల్స్ చేసి, ఇన్స్టాగ్రాంలో అప్లోడ్ చేశారు. ఈ రీల్ సోషల్ మీడి యాలో విపరీతంగా వైరల్ అయంది.
దీంతో, పోలీసు ఉన్నతాధికారులకు విషయం తెలిసి దిద్దుబాటు చర్యలకు దిగారు. రీల్స్ తీసిన నిందితుణ్ణి గుర్తించి చాంద్రాయణగుట్ట పోలీసులకు సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు అప్పగించారు. అయితే జైల్లో పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఇలా జరిగిం దని, జైల్లో కూడా నేరస్తులు ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వీడియో రీల్స్‌పై చంచల్‌గూడ జైలు సూపరిం టెండెంట్ శివకుమార్‌గౌడ్ స్పందిస్తూ ములాఖత్‌కు వచ్చిన వారు లోదుస్తులలో మొబైల్ ఫోన్ పెట్టుకొచ్చారని, ఈ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.